తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వారసత్వం కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికీ కూడా ఎంతోమంది వారసులు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా సక్సెస్ ని అందుకుంటున్నారు. అందులో దగ్గుపాటి వెంకటేష్ కూడా ఒకరు. రామానాయుడికి ఇద్దరు కొడుకులు ఒకరి పేరు వెంకటేష్ మరొకరు పేరు సురేష్ బాబు.. వెంకటేష్ మాత్రం హీరోగా తెర ముందు కనిపిస్తే సురేష్ మాత్రం తెర వెనుకాల నిర్మాతగా కొనసాగిస్తున్నాడు. వెంకటేష్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకున్నాడు.
అయితే తాజాగా రామానాయుడు అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వెంకటేష్ ..అయితే ఆ సినిమా కాస్త విమర్శలను ఎదురుకుంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు వెంకటేష్ నటించిన చిత్రాలలో రొమాంటిక్ సన్నివేశాలు లేవు.. కానీ ఈ చిత్రంలో మాత్రం అలాంటి సన్నివేశాలు ఉండటంతో ఆయన పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది కాస్త పక్కన పెడితే
వెంకటేష్ పై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేంటంటే రామానాయుడు వెంకటేష్ ని దారుణంగా అవమానించడంతో చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారట. ఇంతకు వెంకటేష్ అంతటి నిర్ణయం తీసుకున్న ఆ సంఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.వెంకటేష్ ఎక్కువగా సౌందర్య తో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. ఈ విషయం చాలామందికి తెలిసిందే..అయితే వీరిద్దరూ మంచి స్నేహితులమని చాలాసార్లు తెలియజేశారు.
ఇండస్ట్రీలో ఒక హీరో, హీరోయిన్ కలిసి చాలా సినిమాలు తీస్తే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అంటూ పుకార్లు ఎక్కువగా వినిపించేవి.. అయితే ఈ వార్త రామానాయుడు చెవిలో పడిందట. అప్పుడు రామానాయుడు వెంకటేష్ కి వార్నింగ్ ఇచ్చాడట. ఇలా నా గురించి వస్తున్న అవాస్తవాలను నా కన్నతండ్రి నమ్మి నాకు వార్నింగ్ ఇచ్చాడు నన్ను నా తండ్రి నమ్మటం లేదు అని సూసైడ్ చేసుకోవాలనుకున్నాడట వెంకటేశ్ ..అలా సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు వస్తున్న వార్తలు నిజం అవుతాయని ఆలోచించి నిర్ణయాన్ని మార్చుకున్నాడట వెంకటేష్.. ఇక ఆ తర్వాత వెంకటేష్ విషయములో తానే అనవసరంగా తొందర పడ్డామని రామానాయుడు ఎంతో బాధపడ్డాడట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.