విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత త్వరలో పెళ్లి చేసుకోనున్నారని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆశ్రిత గత కొన్ని రోజులుగా హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మెన్ ఆర్ సురేందర్ రెడ్డి మనవడిని ప్రేమిస్తుందని సమాచారం. తాజాగా వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్నీ పెద్దలకి చెప్పారట. పెద్దలు కూడా ఒప్పుకోవటంతో త్వరలో వీరి పెళ్లి జరగనుంది.
ఆశ్రిత హైదరాబాద్ లో `ఇన్ ఫినిటీ ప్లేటర్` పేరుతో పలు బేకరీ అవుట్ లెట్స్ ని ప్రారంభించారు. ప్రస్తుతం వీటి నిర్వహణలో ఆమె బిజీ గా ఉన్నారు.
ఇటీవలే వెంకీ సోదరుడు నిర్మాత డి.సురేష్ బాబు అబ్బాయి ఇంటికి వెళ్లి వీరిద్దరి పెళ్లి గురించి పలు విషయాలను చర్చించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వెంకటేష్ `ఎఫ్-2` సినిమా చిత్రీకరణలో భాగంగా ప్రేగ్ నగరం లో ఉన్నారు. త్వరలో వెంకటేష్ షూటింగ్ ముగించుకుని స్వదేశానికి చేరుకోగానే పెళ్లి ముహూర్తం పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం మరియు పలు వ్యవస్థలు ప్రజల్లో అవగాహన తీసుకు రావటానికి ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో, టాలీవుడ్ లో పేరొందిన దగ్గుబాటి ఫ్యామిలీ వారు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ఎంతో మంది తల్లి తండ్రులకి ఆదర్శం అని చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ టూ దగ్గుబాటి అండ్ ఫ్యామిలీ