సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో నిన్నటి రోజున ఆయనను అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా కైకాల ఆరోగ్యానికి సంబంధించి ఒక హెల్త్ బులిటెన్ ను కూడా అపోలో వైద్యులు విడుదల చేశారు. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. మల్టీ ఆర్గానిక్స్ ఫెయిల్ అయ్యాయని, చికిత్సకు ఆశించినంతగా ఆయన స్పందించడం లేదని వైద్యులు తెలియజేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, కైకాల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆయన అరోగ్య పరిస్థితిని ఆరా తీస్తున్నారు. కైకాల త్వరగా కోలుకోవాలని కొంతమంది నెటిజన్లు, ఆయన అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు. ఆయనకు కొద్దిరోజుల కిందట కాలు జారి కింద పడటంతో చికిత్స చేయించారు.
అయితే ఇప్పుడు మరొకసారి ఆయన ఆరోగ్య తిరగబడింది. ఈసారి ఆయన ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన త్వరగా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం. అందుకు సంబంధించి ఒక పోస్టు వైరల్ గా మారుతోంది.