టాలీవుడ్ లో మల్టీస్టారర్ క్రేజీ ఇప్పుడు ఎక్కువగా నడుస్తోంది. స్టార్ హీరోలు కూడా ఇలాంటి సినిమాల వైపు ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్-వెంకటేష్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు గా సమాచారం. ఈ సినిమాని డైరెక్టర్ త్రివిక్రమ్ చేయబోతున్నాడు అనే వార్త కూడా బాగా వినిపిస్తుంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ భిమ్లానాయక్ సినిమాకు మాటలు, డైలాగులు అందిస్తున్నాడు. అయితే ఇదే తంతు లోనే వెంకటేష్, పవన్ తో కూడా మల్టీస్టారర్ ప్రాజెక్టు సినిమాని చేయడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ సినిమా చేసేందుకు వీరిద్దరూ కూడా చాలా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన త్వరలోనే వేలపడుతుందట.
గతంలో కూడా పవన్ కళ్యాణ్-వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన గోపాల గోపాల చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరి తాజాగా ఈ మల్టీ స్టారర్ సినిమా పై ఆసక్తి నెలకొంది అభిమానులలో. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే నీ మల్టీస్టారర్ సినిమా ఉంటుందో లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.