మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముకుంద సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. చేసిన రెండవ సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న వరుణ్ తేజ్ ఆ తర్వాత ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్ 2, గద్దల కొండ గణేష్ వంటి చిత్రాలతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ఈయన నటించిన ఎఫ్ 3 సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది. ఇకపోతే జయాపజాయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎక్కడ కనిపించలేదు. గని సినిమా డిజాస్టర్ అవడంతో మళ్లీ ఆయన సినిమాల గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు.
ఇకపోతే వరుణ్ తేజ్ సినిమాల విషయాన్ని పక్కన పెడితే ఆయన వ్యక్తిగత జీవితంలో తండ్రిని మించిన ఆస్తులు కూడబెట్టాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే వరుణ్ తేజ్ కు హైదరాబాద్ బిర్యాని అంటే చాలా ఇష్టమట. మరి వరుణ్ తేజ్ ఆస్తులు వివరాల విషయానికి వస్తే తన సంపాదనతో నాలుగు కార్లు, గాయత్రి హిల్స్లో గెస్ట్ హౌస్ కూడా కొనుక్కున్నారట. ప్రస్తుతం వరుణ్ తేజ్ కి మణికొండలో రూ. 9 కోట్ల విలువ చేసి విల్లా కూడా ఉన్నట్లు సమాచారం. సినిమాల ద్వారా కోట్లాది రూపాయలను సంపాదించారు అని త్వరలోనే మంచి అమ్మాయిని చూసి వివాహం కూడా చేసుకోబోతున్నట్లు సమాచారం.
నిజానికి వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు రామ్ చరణ్ తో ఆరెంజ్ సినిమాను తెరకెక్కించి ఆస్తులన్నీ పోగొట్టుకోవడంతో నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన అప్పులన్నీ తీరిపోయాయి అని సమాచారం. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలు వచ్చినా సరే వరుణ్ తేజ్ మాత్రం తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు. ఏదేమైనా వరుణ్ తేజ్ త్వరలోనే వివాహం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే ఆయన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించాలని ఎదురు చూస్తున్నారు.