డైరెక్టర్ శేఖర్ కమల తెరకెక్కించిన హ్యాపీడేస్ సినిమాకు తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు హీరో వరుణ్ సందేశ్. తొలి సినిమాతోనే హీరోగా బాగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత కొత్త బంగారులోకం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న హీరోగా పేరు పొందడంతో స్టార్ హీరోగా మారతారు అనుకున్నారు. కానీ సినిమాలు ఎంపిక విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల ఎన్నో డిజాస్టర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు..
అలా ఏమైంది ఈవేళ ,మరోచరిత్ర వంటి సినిమాలలో నటించిన ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో తన తోటి నటి వీతిక షేర్ తో పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి బంధంతో ఒకటయ్యారు.పెళ్లి తర్వాత వీరిద్దరూ యూఎస్ఏ కి వెళ్లిన వీరిద్దరూ కొద్దిరోజులకి తిరిగి వచ్చేసారు ఆ సమయంలో తాము ఎన్నో కష్టాలు పడ్డామని ఇటీవల ఒక గేమ్ షోలో చెప్పుకొచ్చారు వితిక.
యూఎస్ఏ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బిజినెస్ పెట్టాలని ఆలోచనతో ఉండే వారం కానీ అది అక్కడ వర్కౌట్ కాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయామని కనీసం చేతిలో రూ.5000 కూడా లేదని తెలిపారు.కానీ తమకి ఎప్పుడు కార్లు కొనాలి బంగ్లా కొనాలని ఆశలు లేవు అని ఒకరంటే మరొకరికి సంతోషంగా ఉండడమే ముఖ్యమని సంతోషంగా ఉంటే చూడాలని తనకు కూడా సంతోషంగా ఉంటే చూడాలని వరుణ్ కు కోరికను వీతిక తెలిపింది. వీరిద్దరూ కలిసి బిగ్ బాస్ సీజన్ -3 లో పాల్గొన్నారు మంచి మార్కులు రాగా బిగ్ బాస్ వల్ల కాస్త వెనకేసుకున్నామని తెలిపింది. ఇక మైఖేల్ చిత్రంలో కూడా వరుణ్ కీలకమైన పాత్రలో నటించారు.