టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంతటి క్రేజీ ఉందో చెప్పనవసరం లేదు..అలాగే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి బాజా మూగబోతోంది.. ఇలాంటి తరుణంలో మెగా ఇంటి కోడలు గురించి అలాగే వారి ఫ్యామిలీ గురించి ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో నిహారిక విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే నిహారిక జీవితం బాగుచేశాకే మనం పెళ్లి చేసుకుందాం అని అనిందట లావణ్య. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ కోడలిగా రావాలంటే ఆమె సినిమాలలో నటించకూడదని కండిషన్ పెట్టినట్లు ఎన్నో రూమర్స్ తెరమీద వినిపించాయి.
అయితే తాజాగా మరో రూమర్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.అదేంటంటే..పెళ్లికి టైం దగ్గర పడుతున్న సమయంలో లావణ్య త్రిపాటి తల్లి ఒక షాకింగ్ కండిషన్ పెట్టిందట.ఆ కండిషన్ విన్న ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఇంతకు లావణ్య త్రిపాటి తల్లి కండిషన్ పెట్టిన ఆ సంగతేంటో తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో మెగా డాటర్స్ అయినా శ్రీజా ,నిహారిక ఇద్దరు విడాకులు తీసుకుని భర్తలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇలా విడాకులు తీసుకున్న అమ్మాయిలు నా కూతురి పెళ్లికి వస్తే నలుగురు నానారకాలుగా అనుకుంటారని అందుకే విడాకులు తీసుకున్న వారిద్దరూ నాకు కూతురు పెళ్లికి రాకూడదు అంటూ కండిషన్ పెట్టిందట. కానీ ఈ కండిషన్ కి మెగా ఫ్యామిలీ ఒప్పుకోలేదు.
ఎందుకంటే పెళ్లి విడాకులు అనేది వాళ్ళ సొంత నిర్ణయాలు అలాంటిది ఇంట్లో జరిగే పెళ్లికి మా కూతుర్లు రాకుంటే ఎలా అంటూ నాగబాబు లావణ్య తల్లితో గట్టిగా వాదించారట..మా కుటుంబం గురించి మీకు అన్ని తెలుసు అలాంటప్పుడు ఇలాంటి కండిషన్ పెట్టడం ఏంటిని..ఇక లావణ్య త్రిపాఠి ఈ విషయంలో కలగజేసుకొని తల్లికి సర్ది చెప్పిందట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది..