ఈమధ్య మెగా ఫ్యామిలీ నుంచి ఒక విషయం వైరల్ గా మారుతోంది.అదేనండి వరుణ్ తేజ్ పెళ్లి. ఈ మధ్యనే లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఇద్దరు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే ..అంతేకాకుండా నిశ్చితార్థం కూడా చాలా గ్రాండ్గా నాగబాబు ఇంట్లో జరుపుకున్న విషయం కూడా తెలిసిందే
అయితే ఎప్పుడైతే వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగిందో అప్పటినుంచి ఈ వార్త ఎక్కువగా వైరల్ గా మారుతోంది.అదేంటంటే లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోవటం ఆ మెగా హీరోకి ఇష్టం లేదు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం లావణ్య త్రిపాఠి
ఈమె గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు నాకు మెగా కుటుంబంలో ఒకరంటే ఇష్టమని అలాగే ఆయనతో నటించడం అన్న చాలా ఇంట్రెస్ట్ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆయనతో ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు విడిపోయారట.ఇంతకు ఆయన ఎవరో కాదు సాయిధరమ్ తేజ్.గతంలో సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్నారట.. కానీ వారిద్దరి ఇష్టాలు కలవకపోవడంతో దూరమయ్యారనీ సమాచారం.
ఇక అక్కడికి వాళ్ళిద్దరి ప్రేమాయణం స్టాప్ అయ్యి మళ్లీ ఆ మెగా ఇంటి వారసునితో ప్రేమలో పడి అతనిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. అయితే ఈ పెళ్లి సాయి ధరంతేజ్ కి అస్సలు ఇష్టం లేదట. వీరి ఎంగేజ్మెంట్ లో కూడా ఏదో రావాలంటే రావాలని వచ్చారట. అంతేకాకుండా ఫోటోలకు కూడా చాలా డల్ గా కనిపించారని ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తోంది. అలాగే లావణ్య త్రిపాఠి గతంలో చెప్పిన ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ కంటే నాకు సాయిధరమ్ తేజ్ ఎక్కువ ఇష్టం అంటూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.