మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగాహీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న సినిమాను ప్రారంభించారు. వరుణ్ తేజ్ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తుండగా, రెనైసాన్స్ పిక్చర్, అల్లు వెంకటేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటించబోతున్నారట.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఫ్రీ ప్రోడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభిస్తారట. అయితే సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి చేయనున్నారు. వరుణ్‌తేజ్ తన కేరీర్లో 10వ సినిమాగా వస్తున్న ఈచిత్రంకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వరుణ్ తేజ్ కేరీర్లో బెస్ట్‌గా నిలిచేలా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.
మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ ఇప్పటికే గద్దలకొండ గణేష్ సినిమా అందించిన విజయంతో మంచి జోష్‌గా ఉన్నాడు. గద్దలకొండ గణేష్ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్ళను అందుకుంది. వరుణ్‌తేజ్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.ఎఫ్2తో ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తగా, గద్దలకొండ గణేష్‌తో రచ్చరంబోలా చేశారు. ఇప్పుడు మూడో సినిమాకు మూహూర్తం ఫిక్స్ చేసుకుని వరుణ్‌తేజ్ అభిమానుల్లో జోష్ నింపారు.