మెగా ఆఫర్ రిజెక్ట్ చేసిన వరుణ్ తేజ్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా జనాలు దాన్ని మిస్ అవ్వడంలేదు. ఎన్టీఆర్ బయోపిక్ కోసం చంద్రబాబు పాత్రలో నారా రోహిత్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్‌ను రానా సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి ట్రెండ్ అయ్యాయి. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త సినీ జనాల్లో తెగ హల్ చల్ చేస్తోంది.

నందమూరి తారక రామారావు జీవితకథలో దాదాపు అందరి పాత్రలను చూపించేలా దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఈ సినిమాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాత్రను మెగా ఫ్యామిలీ హీరోతో చేయించాలని క్రిష్ అనుకున్నాడు. అందుకే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను ఈ విషయమై అడగ్గా దానికి వరుణ్ నో అని చెప్పాడట. చిరంజీవి లాంటి స్టార్ పాత్రను తాను చేయలేనని వరుణ్ తేజ్ చెప్పినట్లు తెలుస్తోంది. వరుణ్ ఇలా ఈ పాత్రను రిజెక్ట్ చేయడంతో మరే మెగా హీరో కూడా దీనిని చేసేందుకు ముందుకు రావడం లేదు.

దీంతో ఎన్టీఆర్ బయోపిక్‌లో చిరు పాత్రను లేపేద్దామనే నిర్ణయానికి వచ్చాడట క్రిష్. ఇక ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్, సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారు. మరి ఈ బాలకృష్ణ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తాడా లేడా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

Share.