Varun Tej.. వరుణ్ తేజ్ (Varun Tej) .. మెగా ఫ్యామిలీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా సినిమాల ద్వారానే కాకుండా చిన్నపిల్లలను ఆదరించడంలో ముందు వరుసలో ఉండే వరుణ్ తేజ్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా అంధ పిల్లలకు డబ్బు సహాయం కూడా అందించారు. ఇదిలా ఉండగా ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. గత కొన్ని రోజులుగా ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమిస్తున్నట్లు వార్తలు విపరీతంగా వినిపించాయి.
అంతేకాదు ఆమె పుట్టినరోజు సందర్భంగా వరుణ్ తేజ్ రింగ్ కూడా ఇవ్వబోతున్నాడు అని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఈ పుకార్లకు చెక్ పడిందని చెప్పవచ్చు . తాజాగా మెగా ఫ్యామిలీ (Mega family) ఇంట పెళ్లి సందడి మొదలు కాబోతోంది అనే వార్తలు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. అసలు విషయంలోకెళితే గత ఏడాది నుంచి మెగాస్టార్ ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఒకవైపు రాంచరణ్ , ఉపాసన లు తల్లిదండ్రులు కావడం.. మరొకవైపు మెగాస్టార్ వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం.. ఇంకొక వైపు ఆర్.ఆర్.ఆర్ చిత్రం కూడా అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను గెలుచుకోవడం అన్నీ కూడా మెగాస్టార్ ఫ్యామిలీకి శుభవార్తలు తెచ్చిపెడుతున్నాయి.
ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ (Daggubati family)తో బంధుత్వం కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నాగబాబు (Nagababu) కొడుకు వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో చిన్న కూతురుని ఆయన వివాహం చేసుకోబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ హీరో ఎవరో కాదు విక్టరీ వెంకటేష్. దగ్గుబాటి వారసుడు విక్టరీ వెంకటేష్ చిన్న కూతురు హయవాహిని ని వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోనున్నాడు అని సమాచారం.
ఇప్పటికే ఇరు కుటుంబాలు కూడా పెళ్లి గురించి చర్చించుకున్నారని అన్ని కుదిరితే త్వరలోనే పెళ్లి భాజలు మోగలు ఉన్నాయని చెబుతున్నారు.అయితే అటు మెగా ఫ్యామిలీ ఇటు దగ్గుపాటి ఫ్యామిలీ ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఇద్దరిలో ఏ ఒక్క కుటుంబం కన్ఫర్మ్ చేసినా సరే అభిమానుల సంతోషాలు మిన్నంటుతాయి.