మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పేస్ థ్రిల్లర్ ” అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ “, ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదల చేసారు చిత్ర బృందం. వరుణ్ తేజ్ మరో సారి అత్యంత క్లిష్టమైన మరియు విభిన్నమైన కథని ఎంచుకున్నారు. అదితి రావు, వరుణ్ తేజ్ ఈ సినిమాలో ఆస్ట్రోనౌట్స్ గా కనిపించనున్నారని తెలుస్తుంది.
తాజాగా విడుదల చేసిన టీజర్ తో ఈ చిత్రం పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. గతంలో సంకల్ప్ రెడ్డి రానా తో ” ఘాజి ” చిత్రాన్ని నిర్మించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ కోసం చిత్ర దర్శకుడు సరికొత్త టెక్నాలజీ ని ఉపయోగించారని టాక్. విజువల్ ఎఫెక్ట్స్ ఈ స్పేస్ థ్రిల్లర్ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానున్నాయని టీజర్ ద్వారా కూడా అర్ధం అవుతుంది. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు నిర్మిస్తున్నారు.