ఎన్టీఆర్ లేకుంటే గద్దలకొండ గణేష్ రిలీజ్ అయ్యేది కాదు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా గద్దలకొండ గణేష్. వాల్మీకి సినిమాగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా బోయ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతినడం వల్ల సినిమా రిలీజ్ మరో నాలుగైదు గంటలు ఉన్నాయనగా సినిమా టైటిల్ మార్చేశారు. అయితే రాత్రికి రాత్రికి సినిమా టైటిల్ మార్చేస్తున్నట్టు హరీష్ శంకర్ ప్రెస్ మీట్ పెట్టి ఎనౌన్స్ చేశారు.

అయితే ఆ టైంలో వరుణ్ తేజ్ కు కూడా ఏం చేయాలో తోచలేదట. వెంటనే రాం చరణ్ కు కాల్ చేయగా కలుద్దామని అన్నాడట. ఆ టైంలో రాం చరణ్ ను వరుణ్ తేజ్ కలవగా అక్కడ ఎన్.టి.ఆర్ కూడా ఉన్నాడట. చరణ్, ఎన్.టి.ఆర్ లు తనని కూల్ చేశారని. టెన్షన్ గా ఉన్న తనని వాళ్ల మాటలతో సర్ధి చెప్పారని అన్నాడు వరుణ్ తేజ్. సో వరుణ్ తేజ్ సినిమా టెన్షన్ తగ్గించడంలో వాళ్లిద్దరి సహకారం ఉంది అన్నాడు.

ఓ పక్క మెగా నందమూరి ఫ్యాన్స్ గొడవ పడుతుంటే హీరోలు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తామంతా ఒక్కటే అన్నట్టుగా ఉంటున్నారు. వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్ పేరు చెప్పి నందమూరి ఫ్యాన్స్ మనసులు గెలిచాడు. మొత్తానికి చివరి నిమిషం లో టైటిల్ మార్చిన గద్దలకొండ గణేష్ మాత్రం కలక్షన్స్ లో గత్తరలేపిండు.

Share.