మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సెలక్టివ్ కథలను ఎంపిక చేసుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. వరుణ్ తీసే సినిమాల కథలు చూస్తే ఒకదానికొకటి సంబంధం ఉండడం లేదు. కథల ఎంపికలో ఇంత తక్కువ వయస్సులోనే మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. తనతో పాటు హీరోలుగా ఇండస్ట్రీకి వచ్చిన యువ హీరోల కెరీర్ ఒక హిట్టు రెండు ప్లాప్స్ అన్నట్టుగా వెళ్తుంటే వరుణ్ మాత్రం విభిన్న కథలను ఎంచుకుంటూ తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు.
ఈ యేడాది సంక్రాంతికి మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో కలిసి నటించిన ఎఫ్ 2 సినిమా సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఈ ఇద్దరు హీరోల కెరీర్లోనే కాకుండా టోటల్ టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ‘వాల్మీకి’ (గద్దలకొండ గణేష్) సినిమా కూడా హిట్ అవ్వడంతో వరుణ్ మార్కెట్ బాగా పెరిగింది.
దీంతో ఇప్పటివరకు 3 నుండి 4 కోట్లు ఉన్న అతని రెమ్యునరేషన్ ఒక్కసారిగా డబుల్ చేసినట్టు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్‌తో సినిమా చేయాలంటే మీడియం రేంజ్ నిర్మాతలు సైతం ఆలోచించాల్సిన పరిస్థితి. రేటు విషయంలో మాత్రం వరుణ్ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదట.
తొలిప్రేమ – ఎఫ్ 2 – వాల్మీకి లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇవ్వడంతో వరుణ్‌తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే వరుణ్ తన రెమ్యునరేషన్ 7 నుండి 8 కోట్ల వరకు పెంచేశాడని అంటున్నారు. ఇటీవల కాలంలో వరుణ్ నటించిన ఒక్క అంతరిక్షం సినిమా మినహా మిగిలిన సినిమాలు అన్ని నిర్మాతలకు మంచి లాభాలు తీసుకువచ్చాయి.