బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో ఈ షో ద్వారా ఎంతోమంది బయట వాళ్లకు అవకాశాలు ఇచ్చింది. అంతేకాకుండా ఈ షోలో చేసే ప్రతి ఒక్కరు మంచి గుర్తింపును కూడా తెచ్చి పెట్టింది. అయితే ఈ షో కి వచ్చి మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న వ్యక్తి హైపర్ ఆది.. ఇంకో పక్క జనసేనలో పార్టీ తరపున ప్రచార కార్యకర్తగా కూడా వ్యవహరిస్తున్నాడు.. ఒకప్పుడు సుడిగాలి సుదీర్ ఎలా కనిపించేవాడు ఇప్పుడు అది కూడా ఆ రేంజ్ లోనే కనిపిస్తున్నాడు. ఈ విషయాలు కాస్త పక్కన పెడితే
గత కొన్ని రోజులుగా అతని పెళ్లి వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది. ఎప్పటినుంచో ఒక యాంకర్ తో ప్రేమలో ఉన్నాడని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. ఆ యాంకర్ ఎవరో కాదు వర్షిణి అంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికీ ఢీ అనే ప్రోగ్రాంలో కలిసి చేశారు. అంతేకాకుండా కొన్ని ఈవెంట్లలో కూడా కలిసి పని చేశారు. ఆ టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అది పెళ్లి వరకు దారితీస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఆది ఎప్పుడు స్పందించలేదు వర్షిణి మాత్రం ఛాన్స్ చిక్కినప్పుడల్లా ఈ విషయాన్ని ఖండిస్తూనే వస్తోంది. మొన్నటికి మొన్న ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి వార్తలపై వస్తున్న వార్తలను ఖండించింది.
నా పెళ్లి విషయం మా అమ్మానాన్నలకే వదిలే స్తున్నా వారు ఎవరిని చూపిస్తే వాళ్లనే చేసుకుంటానని తెలియజేసింది…పెళ్లి బాధ్యత పూర్తిగా వాళ్ళదే అని చెప్పుకొచ్చింది. ఇంస్టాగ్రామ్ లో ఈ విషయంపై మరో క్లారిటీ ఇచ్చింది. హైపర్ ఆదికి వర్షిణి కి పెళ్లి అంట నిజమేనా అన్న ప్రశ్నకు.. షాకింగ్ ఎమోజీలను ఆన్సర్ గా షేర్ చేసింది. దీంతో మరోసారి అందులో నిజం లేదని చెప్పకనే చెప్పింది. ఈ ఏడాదైనా ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కుతుందో లేదో చూడాలి.