ఈ ఏడాది సంక్రాంతికి వరుసగా సినిమాలు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా జనవరి 11వ తేదీన తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన వారసుడు సినిమా విడుదల కావాల్సి ఉన్నది. అయితే ఇప్పుడు ఈ సినిమా కూడా వాయిదా పడింది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తమిళ వర్షన్ ను మాత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. దిల్ రాజు ఈ సినిమా వాయిదా పై మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా తన మనసులో ఈ విషయాన్ని అనుకుంటున్నాను తన చుట్టూ ఉన్నవారు ఆఫీసులో ఉండేవారు రెండో రోజుల క్రితమే ఈ సినిమాని లీక్ చేశారని దిల్ రాజు తెలియజేశారు.
తెలుగులో చిరంజీవి గారు ,బాలకృష్ణ గారు పెద్ద హీరోలు వారికి సాధ్యం అయినన్ని ఎక్కువ థియేటర్లు లభించాల్సి ఉంది. అందుకే వారి సినిమాల తర్వాతే తన సినిమాను విడుదల చేయాలని ఉద్దేశంతో జనవరి 14వ తేదీన వారసుడు చిత్రాన్ని తీసుకురాబోతున్నట్లు తెలియజేశారు. మా బ్యానర్ లో గతంలో వచ్చిన సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ మాదిరిగానే ఈ చిత్రం కూడా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చాలా నమ్మకంతో తెలియజేశారు. చాలామందితో చర్చించిన తర్వాతే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని దిల్ రాజు తెలియజేయడం జరిగింది.
కొందరు సినిమా వాయిదా వేయవలసిన అవసరం ఏంటి అనే ప్రశ్న వేశారని అయితే తమిళ్ లో 11న విడుదల అయ్యి ఇక్కడ 14 విడుదల చేస్తే ఎలా అని అడిగారని.. అయితే ఈ సినిమా పైన నమ్మకంతో ఇలా చేస్తున్నానని చెప్పుకొచ్చారు దిల్ రాజు. చిరంజీవి, బాలకృష్ణ స్టార్ హీరోల కనుక వారి సినిమాలకు తెలుగు రాష్ట్రాలలో అన్ని థియేటర్లు అవసరం.. అందుకోసమే ఆలస్యంగా వారసుడు సినిమాని విడుదల చేస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఒక్క నిర్మాత కూడా లాభపడాలని అందరూ డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభాలను దక్కించుకోవాలని ఉద్దేశంతోనే వాయిదా వేశానని తెలిపారు దిల్ రాజు.