ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే క్యాస్టింగ్ కౌచ్ అనగానే టక్కున ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే వారికి మాత్రమే ఇది ఎదురవుతుందని అంటూ ఉంటారు.. కానీ సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు కూడా తప్పలేదని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయాలన్నీ స్వయంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు తెలుస్తోంది ఈమె తండ్రి శరత్ కుమార్ కూడా ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోనే.
ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే పొలిటికల్ గా కూడా మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్నట్లు తెలుస్తోంది. హీరోయిన్గా కొన్ని సినిమాలలో నటించింది కానీ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో విలన్ పాత్రలు చేయడం మొదలుపెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. ఇందులో బాగా సక్సెస్ కావడంతో తెలుగు తమిళ్ భాషలలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ పైన స్పందించడం జరిగింది.
క్యాస్టింగ్ కౌచ్ అనేది ఏ ఇండస్ట్రీలో నైనా ఉంది బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తున్న వారికే క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు.. కానీ నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న సందర్భం ఉన్నదని మొదటిలో కొంతమంది వ్యక్తులు హీరోల తరఫున తన వద్దకు వచ్చే వారని.. హీరోలతో పడుకుంటే అవకాశం వస్తుందని చెప్పేవారని తెలియజేసింది. దీంతో తనకు కోపం వచ్చి వారిని చెడమడ తిట్టేసే దాన్ని అంటూ తెలియజేసింది వరలక్ష్మి శరత్ కుమార్
కానీ నిజంగా హీరోలు అడిగారు లేదో తెలియదు కానీ అలా కొంతమంది తన వద్దకు వచ్చి అడగడంతో అది నిజమే కావచ్చని అనుమానాలు కూడా మొదలయ్యాయని కానీ అలాంటి వాటిని నేను అసలు ఎంకరేజ్ చేయను అంటూ తెలియజేసింది వరలక్ష్మి శరత్ కుమార్.కానీ ఆ హీరో పేర్లు మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.