డి.రామానాయుడు వారసుడిగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్. ఆయన అమెరికాలో చదువుకున్నప్పటికి సినిమాల మీద వ్యామోహంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతునే ఉన్నాడు వెంకటేష్. సినీ ఇండస్ట్రీ లో ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సక్సెస్ కావడం చాలా కష్టము. కానీ వాటన్నిటినీ అవలీలగా ఛేదించాడు వెంకటేష్.
విక్టరీ వెంకటేష్ ఒక వైపు హీరోగా.. మరొకవైపు బిజినెస్ లో కూడా తన హవా కొనసాగిస్తున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యధికంగా నంది అవార్డులను అందుకున్న హీరో వెంకటేష్ అని చెప్పవచ్చు. ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు 40 సంవత్సరాలు పైనే కావస్తోంది.. ఇక కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి..వీరీ ఇల్లు ఇంద్రభవనం లా ఉంటుంది. ఇక తన అన్న సురేష్ బాబు తో కలిసి కొన్ని రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టాడు వెంకటేష్. అంతా కలుపుకొని ఇప్పటికి ఈయన ఆస్తి రూ. 2,250 కోట్ల వరకు ఉందని సమాచారం. కానీ తన తండ్రి నుంచి వచ్చే ఆస్తులు ఇంకా చాలానే ఉన్నాయట అవన్నీ కలుపుకుంటే.. రూ.6,000 కోట్లకు పై మాట అని అన్నట్లు సమాచారం.