తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. అలా వరుసగా సినిమాలలో నటిస్తూనే మంచి పాపులారిటీ సంపాదించిన రామ్ చరణ్ ఇటీవల తండ్రిగా మారిన విషయం తెలిసిందే గత 11 సంవత్సరాల క్రితం ఉపాసనాన్ని ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఉపాసన కూడా ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి.
ఉపాసన అపోలో హాస్పిటల్ ఫౌండర్ సి ప్రతాపరెడ్డి మనవరాలు.. ఈయన ఇండియాలో ఉన్నటువంటి టాప్ బిలినియర్లు ఒకరని చెప్పవచ్చు. ఇలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన ఉపాసన మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టి మెగా కోడలుగా తన బాధ్యతలను నెరవేరుస్తూనే ఉంది.. ఉపాసన అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ గా బాధ్యతలు వ్యవహరిస్తున్నది. అలాగే బిజినెస్ ఉమెన్ గా కూడా ఉపాసన మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇలా వృత్తిపరమైన జీవితాలలో మంచి సక్సెస్ ను అందుకుంది ఉపాసన. రామ్ చరణ్, ఉపాసన ప్రస్తుతం తల్లితండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఈ క్రమంలోని ఉపాసన రామ్ చరణ్ ఆస్తి గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. వీరిద్దరి ఆస్తి కలుపుకొని దాదాపుగా రూ.2500 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు సమాచారం ఇందులో ఉపాసన ఆస్తి విలువ రూ.1150 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ వృత్తిపరమైన జీవితంలో కూడా ఎంతో సక్సెస్ సాధించడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు.అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా తన తదుపరిచిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతానికైతే రామ్ చరణ్ తండ్రైన ఆనందంలో సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి తన బిడ్డ దగ్గరే ఉన్నట్లు తెలుస్తోంది.