వరుణ్ తేజ్ వాల్మీకి ప్రీ టీజర్

Google+ Pinterest LinkedIn Tumblr +

మాటల్లేవ్… మాట్లాడుకోవడాల్లేవ్… అని ఓ సినిమాలో డైలాగ్ విన్నట్లు గుర్తు. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు గుర్తు చేసుకోవడం… మాటలు లేకుండా, మాట్లాడుకోవడాలు లేకుండా ఏదైనా జరుగుతుందా…? అంటే కాదని మనమైతే ఠక్న సమాధానం చెప్పొచ్చు.. కానీ మళ్ళా మూకీ రోజులు రాబోతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకుంటే ఈ వార్త వింటే మీరు కూడా అరే నిజమే అంటారు…

ఇంతకు ఈ మూకీ గురించి ప్రస్తావన మళ్ళీ రావడం ఎందుకంటే… మన సినిమా రంగం మొదట మూకీ చిత్రాలతోనే ప్రారంభమైంది. భీష్మ ప్రతిజ్ఞ అనే సినిమాను రఘుపతి వెంకయ్య నాయుడు మూకీ చిత్రాన్ని 1921లో నిర్మించాడు. అంటే తెలుగు సినిమా రంగం ఎలాంటి మాటలు, పాటల్లేకుండానే మూగసైగలతోనే వచ్చింది. కొత్త వింత పాత రోత అనే సామెతకు కాలం చెల్లినట్లుంది… ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా ఉంది ప్రస్తుత వాల్మీకి చిత్ర యూనిట్ వ్యవహారశైలి. ఈ చిత్ర ప్రీ టీజర్ లో ఎటువంటి మాటలు లేకపోవటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. చిత్రంలో పూజాహెగ్డే తేజ్కు జోడిగా, తమిళ హీరో ఆదర్వా మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫ్రీ టీజర్ను ఈ రోజు విడుదల చేసారు. ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.

Share.