మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో మెగా హీరోలు నడుస్తున్నారు. హీరోగా ఆయన ఏర్పరచిన దారిలోనే మెగా వారసులు కూడా హీరోలుగా తెరంగేట్రం చేస్తున్నారు. పవన్, చరణ్, బన్ని, వరుణ్, సాయి ధరం తేజ్, శిరీష్ లతో పాటుగా కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరో హీరో వైష్ణవ్ తేజ్ ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు.
సాయి ధరం తేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్ ఎంట్రీ కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్తే. ఇక ఫైనల్ గా అతని డెబ్యూ మూవీ ఓకే అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారట. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చి బాబు వైష్ణవ్ తేజ్ ను డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది.
చిరుతో కలిసి 8మంది హీరోలున్న మెగా ఫ్యామిలీలో 9వ హీరోగా వైష్ణవ్ తేజ్ ఎలాంటి సందడి చేస్తాడో చూడాలి. మెగా ఫ్యామిలీ నుండి ఎంతమంది వచ్చినా మెగా ఫ్యాన్స్ ఆదరణ ఉంటుంది.