నాగచైతన్య సినీ ఇండస్ట్రీలో ఎంత ఫర్ఫెక్ట్ గా ఉంటారో వ్యక్తిగత విషయంలో కూడా ఆయన అంతే పర్ఫెక్ట్ గా ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే.. నిజానికి నాగచైతన్య, సమంతను ప్రేమించి , పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే . అయితే తన భార్య నుంచి విడాకులు తీసుకుంటానని ప్రకటించిన తర్వాత ఏ రోజు కూడా తన విడాకుల వ్యవహారం గురించి ఆయన స్పందించలేదు. కానీ సమంత మాత్రం చైతన్య మీద ఉన్న ప్రేమను దూరం చేసుకోలేక తన బాధను సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా కొంతవరకు తగ్గించుకుందనే చెప్పాలి.
తాజాగా నాగచైతన్య కు సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చైతన్యను మీరు ఎలాంటి పాత్రలు చేయడానికి ఆసక్తి చూపరు..? అని ప్రశ్నించడం జరిగింది. నాగచైతన్య మాట్లాడుతూ.. నేను అన్ని తరహా పాత్రలను చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాను.. కానీ నేను చేసే సినిమా కానీ, పాత్ర కానీ నా కుటుంబం పై ఎటువంటి ఎఫెక్ట్ చూపదు అని తెలిస్తే కచ్చితంగా పాత్ర చేయడానికి ఒప్పుకుంటాను అని తెలిపాడు. ఇకపోతే ఇండైరెక్ట్గా నాగచైతన్య ఈసారి మాత్రం సమంతను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది అని నెటిజన్లు చెబుతున్నారు.
తాజాగా పుష్ప ఐటమ్ సాంగ్ సినిమా లిరిక్స్ అబ్బాయిలను తక్కువ చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. కొంతమంది అయితే ఈ పాటను నిషేధించాలని కోర్టులో కేసు వేశారు. ఇక సమంత కూడా నాగచైతన్యను దృష్టిలో పెట్టుకుని ఈ పాటకు ఒప్పుకోని వుంటుంది అని కొంతమంది అంటుంటే , నాగచైతన్య మాత్రం తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ఏ పాత్రలో కూడా చేయనని స్పష్టం చేశాడు.
Nee clarity @chay_akkineni 👌👌 pic.twitter.com/LAXv1T6AMz
— RishiQ (@risheek_king) December 10, 2021