సమంత – నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రకటించినప్పటి నుంచి సమంత సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ కూడా వైరల్ అవుతూ వచ్చింది. విడాకులు తీసుకున్న తరువాత ఎవరి పనుల్లో వారు బిజీ అయి పోతూ, సినీ ఫీల్డ్ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకోవడానికి చాలా తపన పడుతున్నారు. సమంత పూర్తిగా తన కెరియర్ పైన దృష్టి పెట్టడంతో పాటు టాలీవుడ్ ,బాలీవుడ్, హాలీవుడ్,కోలీవుడ్ అంటూ అన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
ఇక నాగచైతన్య కూడా లవ్ స్టోరీ సినిమా సక్సెస్ తర్వాత బంగార్రాజు సినిమాతో మంచి ఫాంలోకి దూసుకుపోతున్నాడు. అసలు విషయానికి వెళ్తే ఆమె ఇంస్టాగ్రామ్ లో కొన్ని స్టోరీస్ లను పెట్టింది.. వాటిలో మీరు గట్టి పోరాటం చేసి ఓడిపోతారు.. కొన్నిసార్లు మీరు చాలా గట్టిగా పోరాటం చేసినా వదిలేయక తప్పదు అంటూ మరో కొటేషన్ షేర్ చేసింది. ఇక దీంతో ఇది విన్న అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తూ.. సమంతకు విడాకులు తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.. వారి బలవంతం వల్లే ఆమె విడాకులు తీసుకోవడానికి కారణం అయ్యింది.. సమంత ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది అంటూ అభిమానులు రక రకాలుగా స్పందిస్తున్నారు.