జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం పై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంతో ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని కొరటాల శివ కూడా ఛాలెంజ్ గా ఈ సినిమాని తీసుకున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ ఇటీవలే కంప్లీట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆచార్య సినిమాతో డిజాస్టర్ అయిన కొరటాల శివ ఈ సినిమాతో మరొకసారి తన స్టామినా చూపించాలని చూస్తున్నారు.
ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులు తాజాగా అఫీషియల్ గా కొరటాల శివ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.కానీ చిత్ర నిర్మాణ సంస్థ యువ సుధా నుంచి రెండుసార్లు అప్డేట్ విడుదల చేయడం జరిగింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పిన ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.. అయితే కొరటాల శివ మ్యూజిక్ సిట్టింగ్ కోసం ఒకసారి అనురుధ్ తో కూర్చుని మాట్లాడుతున్నట్లుగా కొన్ని ఫోటోలు గతంలో వైరల్ గా మారాయి.
దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ట్రాక్ లో ఉందని క్లారిటీ వచ్చింది.ఈ సినిమా కోసం సిటీ అవుట్స్కట్లో భారీగా సెట్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా ఓపెనింగ్ లేకుండా రెగ్యులర్ షూటింగ్ తోనే సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెలవాకరులో ఈ సినిమా సింగిల్ షెడ్యూల్ మొదలుపెట్టే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ అది కుదరకపోతే మార్చి నెలలో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. శంషాబాద్ దగ్గర నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఆ తర్వాత గోవాలో సెకండ్ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇలా అయిపోయిన వెంటనే తిరిగి హైదరాబాదులో షూటింగ్ అని ముగించుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.