క్రిస్మస్ పండుగకు సందడి చేయనున్న చిత్రాలు ఇవే?

Google+ Pinterest LinkedIn Tumblr +

దర్శక నిర్మాతలు వారు తెరకెక్కించిన సినిమాలను ఎక్కువగా పండుగ సమయాలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి అన్ని కసరత్తులు చేస్తూ ఉంటారు. ఎక్కువగా పండుగ పర్వదినాల్లో సినిమాలను ప్రదర్శించేందుకు ఆసక్తిగా ఉంటారు.ఇక ఇప్పటికే ఈ సంవత్సరం పండుగలు అన్ని పూర్తి అయిపోయాయి. ఇక చివరిగా మిగిలింది క్రిస్మస్ పండుగ. మరి క్రిస్మస్ పండుగకు సందడి చేయబోయే ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

గని : వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గని. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతోంది. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది.

శ్యామ్ సింగరాయ్ : నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఇందులో నాని ద్విపాత్రాభినయం లో నటిస్తున్నారు. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు.

83 : బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం. ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాను చివరగా డిసెంబర్ 24న విడుదల చేయడానికి తేదీని ఖరారు చేశారు చిత్ర బృందం. ఇందులో రన్వీర్ కెప్టెన్ కపిల్ దేవ్ గా ఆయన భార్య రోమి బాటియాగా దీపిక పదుకునే నటించింది.

జెర్సీ : గౌతమ్ తిన్ననూరి జెర్సీ. అదే పేరుతో హిందీలోనూ రూపొందింది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ సినిమా డిసెంబర్ 31న విడుదల కానుంది. హిందీలో కూడా ఈ సినిమాకు గౌతమ్ దర్శకత్వం వహించారు.

Share.