టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ గా పేరు పొందారు రామ్ చరణ్, ఉపాసన. ఉపాసన కొణిదెల ఇంటికి కోడలిగా వెళ్లినప్పటి నుంచి ఈమె మంచి పాపులారిటీ సంపాదించింది. ఒకవైపు రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న, మరొకవైపు ఉపాసన బిజినెస్ విషయాలలో క్షణం తీరిక లేకుండా ఉంటుంది. కానీ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గానే ఉంటూ సామాజిక కార్యక్రమాలతోపాటు సినిమాలకు అన్ని ప్రోగ్రామ్స్ లోను చాలా చురుకుగా పాల్గొంటూ ఉంటారు.
ఎల్లప్పుడు కూడా తన భర్త రామ్ చరణ్ వెంట ఉండనే ఉంటుంది ఉపాసన. రీసెంట్ గా ఇండియా అవతల జరిగిన RRR ప్రమోషన్లలో కూడా ఉపాసన, రాంచరణ్ వెంటే నడవడం జరిగింది. ఫారన్లో జరిగిన ప్రతి ఈవెంట్లో పాల్గొన్న ,ఇంటర్నేషనల్ అవార్డు సేర్మానీలో ఆయనతోనే ఉన్నది. ఈ సందర్భంగా తన భర్త గురించి తెలియజేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఉపాసన. చెర్రీ నామ సంవత్సరమంటూ తెలియజేసింది ఉపాసన. తన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలు రామ్ చరణ్ నాకు మద్దతుగా నిలిచారని తెలుపుతోంది.
అలాగే నేను చెర్రీకి అన్ని విషయాలలో కూడా సపోర్టుగా ఉంటున్నాను నాటు నాటు సాంగ్ షూటింగ్ కోసం ఉక్రెయిన్ కి వెళ్ళినప్పుడైనా..ఇంట్లో ఉన్న.. అలాగే షూటింగ్ అంటూ బిజీగా గడుపుతున్నప్పుడైనా ఇలా ప్రతి విషయంలో నేను తన భర్తకు వెన్నంటే ఉన్నాను అంటూ తెలుపుతోంది. ఎలాంటి సందర్భంలోనైనా తనకు నేను సాయి శక్తుల సహాయం చేస్తూ ఉంటాను ఇక చెర్రీకి చాలా ఆనందాన్ని ఇచ్చింది తన వర్క్ పరంగా కూడా ఎంతో సంతృప్తిగా ఉన్నారు ఈ సంవత్సరం ఎన్నో ప్రశంసలు అందుకున్నారు అందుకే ఏడాది తనదే అంటూ చెప్పుకొచ్చింది