మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ .అలా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించారు.. మొదట హీరో కొడుకు అని ముద్రతో ఇండస్ట్రీలోకి అడిగి పెడతా రామ్ చరణ్ ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు..RRR చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా కూడా పేరు పొందారు. ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందడం జరిగింది.
రామ్ చరణ్ ఉపాసన ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. వీరీ వివాహం 2012 జూన్ 14న జరిగింది.. అయితే వీరి వివాహం అయ్యే సమయంలో వీరి మీద చాలా మంది ట్రోల్ చేశారని అయినప్పటికీ వాటిని అసలు పట్టించుకోలేదని తెలియజేస్తోంది ఉపాసన. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
ఉపాసన మాట్లాడుతూ వివాహమైన కొత్తలో తమకు జరిగిన గొడవల వల్ల గురించి కూడా తెలియజేసింది.. వివాహమైన సమయంలో చాలా మంది తనని ట్రోల్ చేశారని ఆస్తి కోసమే రామ్ చరణ్ ఈమెను వివాహం చేసుకున్నారని ప్రచారం చేశారట.కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఎందుకంటే రామ్ చరణ్ తో తాను ఐదు సంవత్సరాల క్రితమే ప్రేమలో ఉన్నానని తెలిపింది. అయితే తామిద్దరం కలిసింది మాత్రం ఒక కామన్ ఫ్రెండ్ ద్వారానే అంటూ తెలుపుతోంది.
ఎలా కలిసినప్పటికీ మాత్రం తామద్దరం ఇప్పటికీ అన్యోన్యంగా ఉన్నామని పెళ్లయిన కొత్తలో మా ఇద్దరి మధ్య కొన్ని గొడవలు వచ్చాయి..పెద్దవి అనుకుంటే పొరపాటు ఎందుకంటే భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. మా ఇద్దరి మధ్య అలాంటి చిలిపి గొడవలు జరిగేవి అంటూ తెలుపుకొస్తుంది. వివాహమయ్యాక 14 కిలోల బరువు తగ్గానని తెలియజేస్తోంది ఉపాసన. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామని తెలిసింది.