Unstoppable: బాలయ్య షో లో సందడి చేయనున్న రామ్ చరణ్ – కేటీఆర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తున్న అన్ స్టాపవుల్ సెలబ్రిటీ టాక్ షో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మొదటి సీజన్ తో పోలిస్తే రెండవ సీజన్ కి కాస్త బజ్ తగ్గినప్పటికీ ప్రభాస్ రావడంతో అది కాస్త భర్తీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారని మరొకవైపు కమలహాసన్ కూడా రాబోతున్నారని.. వీరి ఎపిసోడ్ ల షూటింగులు కూడా జనవరి 6న మొదలుపెట్టబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య అన్ స్టాపబుల్ షో కి రామ్ చరణ్ తో పాటు కేటీఆర్ కూడా హాజరు కాబోతున్నారట.

Unstoppable: Ram Charan and KTR to grace next? - JSWTV.TV

తెలంగాణ రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్న యంగ్ లీడర్.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్ స్టాపబుల్ టాక్ షోకి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కూడా రాబోతున్నారు. మొత్తానికైతే ఈ ఇద్దరు కూడా భారీ పాపులారిటీ కలిగిన సెలబ్రిటీలు కావడం గమనార్హం. ఒకరు తెలంగాణ రాజకీయాలలో డైనమిక్ లీడర్ గా దూసుకుపోతుంటే.. మరొకరు పాన్ ఇండియా సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇలాంటి దిగ్గజ సెలబ్రిటీలు అన్ స్టాపబుల్ సీజన్ 2 లో పాల్గొంటారన్న వార్త నిజమైతే గనుక పాపులర్ ఎపిసోడ్స్ లో ఇదే ముందు వరుసలో ఉండే అవకాశం ఉంది అని అప్పుడే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా మినిస్టర్ కేటిఆర్ కు టాలీవుడ్ స్టార్లతో మంచి సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్ర ప్రమోషన్స్ లో డైరెక్టర్ హీరో మహేష్ తో కలిసి ఆయన చిట్ చాట్ సెషన్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు రాంచరణ్ తో కలిసి రావడం నిజంగా అద్భుతమైన ఎపిసోడ్ అవుతుందని చెప్పవచ్చు. మరి వీరిద్దరికీ సంబంధించిన ఎపిసోడ్ పై అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడించనున్నారు.

Share.