అన్ స్టాపబుల్: అదరగొడుతున్న పవన్ కళ్యాణ్ ఫస్ట్ గ్లింప్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా సక్సెస్ఫుల్ గా దూసుకు వెళ్తున్న షో అన్ స్టాపబుల్.. మొదటి సీజన్ పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు రెండవ సీజన్లో కూడా ఆడియన్స్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఒక ఎపిసోడ్ తర్వాత మరొక ఎపిసోడ్ రాబోతుండడం ఒక్కొక్క ఎపిసోడ్ కు విభిన్నమైన హీరోలు, హీరోయిన్లు రావడంతో షోపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విత్ బాలయ్య బాబు షో స్ట్రీమింగ్ కానుంది. హోస్ట్ గా బాలయ్య.. గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఈ కాంబినేషన్ అసలు ఏ మాత్రం ఊహించని అభిమానులకు ఈ ఎపిసోడ్ కన్నుల పండుగను అందిస్తుందని చెప్పవచ్చు.

తాజాగా పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. అయితే సంక్రాంతికి ఈ ఎపిసోడ్ రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ సంక్రాంతికి వీరసింహారెడ్డి టీం ఇంటర్వ్యూ రిలీజ్ చేయడంతో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వాయిదా వేశారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రోమోతోనే సూపర్ అనిపించేశారు. తాజాగా ఒక గ్లింప్ ను విడుదల చేయగా బాలకృష్ణ ఒక్క డైలాగ్ మాత్రమే వదిలారు. అది కూడా ఈయన మెజర్మెంట్స్ తీసుకోవాలని చెప్పారు బాలకృష్ణ. ముఖ్యంగా అన్ స్టాపబుల్ షో తో బాలయ్య అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తుండగా.. ఈ పవన్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని మనకు అర్థమవుతుంది.

కళ్యాణ్ కూడా ఈ షో ని బాగా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. మరి పవన్, బాలయ్య ఈ స్పెషల్ చిట్ చాట్ ఎలా సాగనుంది? పవర్ ని ఎలాంటి ప్రశ్నలు బాలయ్య అడగబోతున్నాడు ? అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి సంబంధించి చిన్న గ్లింప్ ను విడుదల చేయగా అది ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Share.