అన్ స్టాపబుల్ షోలో మెరవనున్న సూపర్ స్టార్..?

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ అహ లో అన్ స్టాపబుల్ అనే టాప్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ టాక్ షో ప్రారంభమై చాలా కాలం అవుతోంది. మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా మోహన్ బాబు కుటుంబ సభ్యులు రాగ.. రెండవ ఎపిసోడ్ కు నాచురల్ స్టార్ నాని.. వచ్చారు. ఈ రెండు ఎపిసోడ్స్ ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగాయి.

అయితే బాలయ్య చేతికి సర్జరీ కావడంతో ఈ టాక్ షో కు కొంతకాలం పాటు దూరంగా అయ్యారు బాలకృష్ణ. అయితే తాజాగా మూడవ ఎపిసోడ్ ఈ మధ్యనే ప్రసారం అయింది.. ఇందులో కమెడియన్ బ్రహ్మానందం, అనిల్ రావిపూడి గెస్ట్ గా వచ్చారు. ఈ మూడోవ ఎపిసోడ్ కు బాలకృష్ణ అదిరిపోయే రేంజ్ లో హోస్ట్ గా వ్యవహరించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నాలుగోవ షో కి గెస్ట్ గా మహేష్ బాబు రానున్నట్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే బాలకృష్ణ అభిమానులకు, మహేష్ బాబు అభిమానులకు పండగ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు ఒకే వేదికపై కనపడడం అంటే అభిమానులకు చాలా ఇష్టం.

Share.