సినీ ఇండస్ట్రీలో టాప్ సినీ విశ్లేషకులలో ఒకరైన ఉమైర్ సందు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ముఖ్యంగా పలు సినిమాలకు రివ్యూలు ఇవ్వడమే కాకుండా పలుసార్లు వివాదాస్పందమైన వ్యాఖ్యలు చేస్తూ.. ఎన్నో రకాలుగా ట్రొల్స్ కు గురవుతూ ఉంటారు. తాజాగా చిరంజీవి టార్గెట్ చేస్తూ చిరంజీవి అంకుల్ అంటూ ట్రోల్ చేయడం జరుగుతోంది. చిరంజీవి అంకుల్ ఇంకా యంగ్ గా కనిపించేలా ప్రయత్నాన్ని మానుకోండి ఇప్పుడు మీ వయసు 70 ఏళ్ళను గుర్తుంచుకోండి అంటూ ఒక ట్వీట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త నెట్టేంట చాలా వైరల్ గా మారుతోంది.
ఉమైర్ సందు చిరంజీవిని టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు గతంలో ఆయనను దారుణంగా కామెంట్స్ చేయడం జరిగింది. గాడ్ ఫాదర్ సినిమా విడుదల సందర్భంగా ఆయన ఇచ్చిన రివ్యూ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఒక యావరేజ్ సినిమాని కొత్త సీసాలో పాతసార అనేలా ఉందని కామెంట్లు చేశారు. చిరంజీవి గారు మీరు దయచేసి ఇకమీదట సినిమాలు తీయకుండా రెస్ట్ తీసుకోండి అంటూ తెలియజేశారు.
Uncle #Chiranjeevi stop trying to be young! You are 70 🙈😃
— Umair Sandhu (@UmairSandu) December 18, 2022
లేదంటే ఇకమీదట ఏదైనా మంచి కంటెంట్ ఉంటే స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకోండి ప్రజల మనిషి అనిపించుకోండి అంటూ మెగా స్టార్ సినిమా అంటే అసలు ఇలా కనిపించడం లేదు అంటూ ట్విట్ చేశారు. చిరంజీవిపై వివాదాస్పందమైన వ్యాఖ్యలు చేసిన ఉమైర్ సందు పై నెట్టిజాన్లు చాలా విరుచుకుపడుతున్నారు. గొప్ప వారిపైన ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం కేవలం గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నారు అంటూ మరి కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ట్విట్లు కాస్త వైరల్ గా మారుతున్నాయి.
What's wrong in that bro ..u stop being jealous…appreciate him as in his 70 s he is looking like this but look at u ..u r looking like 70
— Dr. Priya (@priyanka8341997) December 19, 2022