అస్మక క్రియేషన్స్ పతాకంపై రోహిత్ కుమార్, సత్య భగత్ , ప్రియాంక పాండే, సోనాక్షి వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం అగ్లీ. దయ దర్శకత్వంలో సుశాంత్ కుమార్ బండారి నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 8న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ఈ సినిమా నుంచి ఓ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ప్రారంభంలోనే డెడ్ బాడీలు, మర్డర్లు అంటూ పోలీస్ చెప్పే డైలాగులతోనే సినిమా క్రైమ్ థ్రిల్లర్ అని అర్ధమైపోతుంది. ఓ ఇంటిలో మొత్తం ఐదు బాడీస్ ఉన్నాయని, అందులో నలుగురు చనిపోయి ఉన్నారని, బాడీస్ ఐడెంటిఫై చేశామని పోలీసు మాట్లాడతాడు.
ఇక అక్కడ నుంచి అసలు కథలోకి తీసుకెళ్ళినట్లుగా ట్రైలర్ ని చూస్తే అర్ధమవుతుంది. అందులో మా అబ్బాయ్ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడని ఒకరు చెప్పగా, మా మ్యారేజ్ యానివర్సరీ రోజే తను చనిపోవడం అని మరొకరు చెబుతారు. అలాగే తనతో లాస్ట్ మెమరీని ఒక లేడీ పాత్ర చెప్పగా, తను అలాంటి వాడు కాదని మరో పాత్ర చెబుతుంది. అయితే ఇవన్నీ మొదట మర్డర్ జరిగిన బాడీస్ తో లింక్ అయిన కథాలాగా అనిపిస్తాయి.
ఇక పోలీసులు ఇన్వెస్టిగేషన్లు, మధ్య మధ్యలో రొమాన్స్ సీన్లు కూడా ఇందులో వచ్చాయి. మొత్తానికి ఈ సినిమా ఫుల్ సస్పెన్స్ తో పాటు….ఓ క్రైమ్ స్టోరీగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చాలావరకు ఆసక్తికరంగానే సాగింది. ఈ సినిమాని కేవలం 29 రోజుల్లోనే తెరకెక్కించినట్లు నిర్మాత సుశాంత్ చెప్పాడు. అయితే టైటిల్ అగ్లీ అని ఉన్న సినిమా మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకొచ్చాడు. స్మరన్ మ్యూజిక్ చేసిన ఈ చిత్రం నవంబర్ 8న థియేటర్లలోకి రానుంది.