నటి సమంత, అది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ యూ టర్న్’, ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు విడుదల చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. సమంత కూడా తన అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ‘యూ టర్న్’ ట్రైలర్ ని తన అభిమానులకి షేర్ చేసింది. ట్రైలర్ ని బట్టి ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని అర్ధం అవుతుంది. అలనాటి అందాల నటి భూమిక ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర లో కనిపించనున్నారు.
పవన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. పూర్ణ చంద్ర ఈ క్రైమ్ థ్రిల్లర్ కి స్వరాలూ అందించారు. వీ వై కంబైన్స్, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 13 వ తేదీన విడుదల కానుంది. ఒకేసారి తెలుగు మరియు తమిళం లో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.