సోషల్ మీడియాలో ఒకటైన ట్విట్టర్ ను ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్విట్టర్ కు సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన పరాగ్ అగర్వాల్ జీతం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ట్విటర్ సీఈఓ గా పరాగ్ అగర్వాల్ సంవత్సరానికి రూ.7.5 కోట్లకు పైగా జీతం పొందుతున్నారని కంపెనీ యు ఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ తాజాగా వెల్లడించడంతో ఈ వార్త కాస్త ప్రస్తుతం వైరల్గా మారుతోంది.అంతే కాదు కంపెనీలో పరాగ్ అగర్వాల్ రూ.94 కోట్ల విలువైన షేర్లను కూడా పొందుతున్నారు అని వెల్లడించింది. షేర్ల ను మరో మూడు నెలల గ్యాప్ లో 16 క్వార్టర్స్లో అందిస్తామని ప్రకటించారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పరాగ్ అగర్వాల్ పేర్లను పొందుతారు. ఇకపోతే ఇతడి కంటే ముందు జాక్ డోర్సే సంవత్సరానికి 1.40 మిలియన్ డాలర్ల జీతాన్ని పొందిన విషయం తెలిసిందే. ఇకపోతే పరాగ్ ఐఐటీ లో విద్యనభ్యసించి..మైక్రోసాఫ్ట్ , యాహూ, L& T ల్యాబ్స్ లో పని చేశారు. 2011 లో ట్విట్టర్ లో చేరి 2017 లో సీటీవో గా బాధ్యతలు చేపట్టాడు. కానీ కేవలం 10 సంవత్సరాల వ్యవధిలోనే ట్విటర్ సీఈఓ గా మారడం అంటే అతని ప్రతిభకు ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు..
ట్విట్టర్ సీఈఓ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
Share.