త్వరలో విలన్ గా ఎంట్రీ ఇవ్వనున్న హీరో ఆదిత్య ఓం..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

దివంగత హీరో హరికృష్ణ, సుమన్ కలిసి కీలక పాత్రల్లో నటించిన సినిమా లాహిరి లాహిరి లాహిరిలో.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన నటుడు ఆదిత్య ఓం.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరై, ఆ తర్వాత బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చారు. ఈయన అక్కడ హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, డైరెక్టర్ గా ఇలా రకరకాల పాత్రల్లో నటించి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళం ,హిందీ, తెలుగు భాషలలో కూడా నటుడిగా , దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం విలన్ పాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాడు.

Aditya Om: I'll prefer to wait than do just anything | Bollywood - Hindustan Times
తాజాగా ఇండస్ట్రీలోకి నాగ వర్మ అనే ఒక కొత్త హీరో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు విక్రమ్ అనే టైటిల్ ను ఎంపిక చేశారు. ఈ సినిమాలో ఆదిత్య ఓం ఒక మాఫియా డాన్ గా నెగిటివ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు అమరం, పవిత్ర అనే సినిమాలలో కూడా విలన్ పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నారు ఆదిత్య. అమరం సినిమా లో హీరో ఆది సాయి కుమార్ కు ఆదిత్య విలన్ గా పోటీ ఇవ్వనున్నారు.

Share.