ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా టాలీవుడ్ లో పలువురు ప్రముఖుల బయోపిక్ లు తీయడానికి స్టార్ సెలబ్రెటీలు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ ,సావిత్రి, రాజశేఖర్ రెడ్డి , జయలలిత లాంటి ఎంతో మంది ప్రముఖుల జీవిత కథ ఆధారంగా పలు సినిమాలను తెరకెక్కించి, మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు తాజాగా మొదటిసారి భారతదేశానికి ఒక తెలుగు నాయకుడు ప్రధానిగా పని చేసిన మొదటి వ్యక్తి పీవీ నరసింహారావు. ప్రధాని హోదాలో నాటి నుంచి నేటి వరకు ఒకే ఒక్క తెలుగువాడు దేశాన్ని పరిపాలించడం అది కూడా ఈయన మాత్రమే కావడం మన తెలుగు వారికి గర్వకారణమని చెప్పాలి.
అందుకే ఈ లీడర్ జీవితాన్ని తెరపైకి తీసుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. క్రేజీ ప్రాజెక్ట్ పై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఒక ప్రకటన చేశారు. ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు బతికి ఉన్న సమయంలో ప్రధానిగా దేశానికి చేసిన సేవలు..తదితర విషయాలను ఒక వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఆయన ఏర్పాటు చేసిన ప్రముఖ ఓ టీ టీ సంస్థ అయినటువంటి ఆహా స్టూడియో లో పీవీ నరసింహారావు బయోపిక్ పై వెబ్ సిరీస్ నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటన చేశారు. దీనికి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ ఝు దర్శకత్వం వహించనున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషలలో పై వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది.