బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ.. రీసెంట్ గా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ జోష్లో ఉంది. ఇకపోతే అభిమానులు ఈ సినిమా సక్సెస్ చూసి ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నట్టు సమాచారం. అంతేకాదు బోయపాటి శ్రీను తో ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని అభిమానులు కోరుతున్నారు. తాజాగా జరిగిన చిత్రయూనిట్ ఇంటర్వ్యూలో కూడా ఈ సినిమా సీక్వెల్ గురించి చర్చించారట.
ఇక మంచి కథ కనుక వస్తే అఖండ సీక్వెల్ తీయడానికి మేము సిద్ధమే అని బాలయ్య బాబు , బోయపాటి శ్రీను తెలిపారు. ఇకపోతే సింహ , లెజెండ్ , అఖండ వంటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న బోయపాటి , బాలకృష్ణ కాంబినేషన్ లో ఇప్పుడు అఖండ సీక్వెల్ వస్తే నాలుగవ సినిమా అవుతుంది. ఇక అఖండ సీక్వెల్ అయితే ఆ లెక్క మరోలా ఉంటుందని చెప్పవచ్చు. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఈ కాంబినేషన్లో మరో సినిమా వస్తే ఇక అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ 105వ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నాడు.