అవతార్.. ఈ సినిమా మనిషి ప్రపంచానికి విరుద్ధంగా ప్రపంచానికి మనల్ని తీసుకెళ్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకుడిని ఊహా ప్రపంచంలో ఆనందంగా విహరించేలా చేయడానికి దర్శకుడు జేమ్స్ కామరూన్ ఎన్నో ప్రయత్నాలు చేసి.. చివరకు అవతార్ సినిమాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను చూసిన వారంతా ఎంతో ఆశ్చర్యానికి లోను అవడంతో పాటు అవతార్ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయం కూడా ప్రజలలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చింది. ఇదిగో అప్పుడు విడుదలవుతుంది.. అదిగో ఇప్పుడు విడుదల అవుతుంది అంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను నిరాశ పరిచినప్పటికీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు చూస్తే మాత్రం త్వరలోనే అవతార్ 2 సినిమా విడుదల కాబోతోందని స్పష్టమవుతోంది.వేరే గ్రహంలో మనుషులు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని అందరికీ చూపించింది ఈ సినిమా. సైన్స్ ఫిక్షన్ సినిమాగా వచ్చిన అవతార్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అవతార్ సినిమా అద్భుతమైన విజయం సాధించిన ఈ విషయం అందరికీ తెలిసిందే.
ఇక ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ఎక్స్క్లూజివ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. మొదటి సినిమాలో అంతరిక్షంలో మనుషులు ఎలా ఉంటారో చూపించారు. అయితే ఇప్పుడు సీక్వెల్లో భూగర్భంలో ఎలా ఉండబోతుంది అని ఊహాచిత్రాలను మనకు చూపించబోతున్నారో తెలుస్తోంది. ఈ చిత్రాలు చూస్తే ఫిదా అవ్వక తప్పదు.