గూగుల్ లో 96 శాతం అంత ఫేక్ న్యూస్: ట్రంప్

Google+ Pinterest LinkedIn Tumblr +

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తన అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ప్రముఖ మల్టి నేషనల్ కంపెనీ గూగుల్ పై విరుచుకు పడ్డారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ” ట్రంప్ న్యూస్ ” అని టైపు చేస్తే తన పై అన్ని తప్పుడు కథనాలే వస్తున్నాయ్ అని, గతంలో కొన్ని ఫేక్ మీడియా చానెల్స్ నా పై ప్రచురించిన న్యూస్ ని గూగుల్ నెటిజన్స్ కి చూపిస్తుందని ఇదంతా అంతర్గతంగా గూగుల్ లో జరుగుతున్న కుట్ర అని మండి పడ్డారు. అంతే కాకుండా నేను చేసిన మంచి ని దాచి పెట్టి అన్ని తప్పుడు వార్తలకి గూగుల్ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని అయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇదంతా ఇల్లీగల్ అని, గూగుల్ లో తన పై వస్తున్న వార్తల్లో 96 శాతం వరకు ఫేక్ అని ట్రంప్ తెలిపారు.

గూగుల్ మనకి తెలియకుండా మనం చూసే వాటిని, చూడని వాటిని మాన్యువల్ గా కంట్రోల్ చేస్తుందని, అందులో భాగంగా ఇలా తన పై కుట్ర కి ప్లాన్ చేసారు. దీని పై నేను త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటానని లేకపోతే ఇది ముందు ముందు మరింత ప్రమాదకరంగా మారుతుందని ట్రంప్ చెప్పారు.

Share.