యాంకర్ రవి ఇంట్లో పోలీసులు..వారిపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి అంటూ ఫిర్యాదు?

Google+ Pinterest LinkedIn Tumblr +

రోజు రోజుకి సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో సెలబ్రిటీలకు అభిమానులకు మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గింది. అయితే అభిమానులు ఇదే అదునుగా తీసుకుని సెలబ్రిటీల పై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. కొందరు సెలబ్రెటీలు ఈ విషయంపై లైట్ తీసుకోగా.. ఇంకొందరు వారిపై ట్రోలింగ్స్ చేసిన వారికి తగిన శాస్తి చెబుతున్నారు. తాజాగా యాంకర్ రవి కూడా ఇలాగే చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో తనపై అసత్య ప్రచారాలు చేయడమే కాకుండా, తన కూతురు, తన భార్యని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

https://www.instagram.com/reel/CXgD9aVAUjk/?utm_source=ig_web_copy_link

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత యాంకర్ రవి తన కుటుంబం పై నెటిజన్స్ స్టూడెంట్స్ చేస్తున్నారని తెలుసుకొని, తన కుటుంబం జోలికి వచ్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని హెచ్చరించాడు. అంతేకాకుండా తన పరువుకు భంగం కలిగించేలా పోస్ట్ లు పెడుతున్న వారి వివరాలు సేకరించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తన గురించి, తన ఫ్యామిలీ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ, అసభ్య పదజాలంతో దూషించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇప్పటికే పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన రవి.. ఈసారి ఏకంగా పోలీసులను తన ఇంటికి పిలిపించుకుని ఆధారాలు స్క్రీన్షాట్ అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని రవి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. మీరు చేయాల్సింది మీరు చేయండి..నేను చేయాల్సింది నేను చేస్తా.. కానీ ఒకరికి నెగిటివ్ కామెంట్ రిప్లై పెట్టే ముందు 30 సెకండ్లు ఆలోచించండి అంటూ పోస్ట్ చేశాడు.

Share.