ప్రతి దర్శక నిర్మాతలకు , హీరోలకు, హీరోయిన్లకు తమ తమ సెంటిమెంట్లను తమ సినిమాల విషయంలో ఫాలో అవుతూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా తన సినిమాలలో తన సెంటిమెంటును ఫాలో అవుతూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఈయన సినిమాలలో పంచులు, ప్రాసలతో పాటు హీరోకి సరికొత్త పేర్లు, స్టోరీలు, ఇద్దరు హీరోయిన్లు వంటివి కామన్ గా ఉంటాయి. ఈ క్రమంలోని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చే సినిమాలలో ఇళ్లను కూడా చాలా ప్రత్యేకంగా చూపిస్తారు . అంతే కాదు ఆయన సినిమాలలో ఇంటికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది.
ముఖ్యంగా కథ మొత్తం కూడా ఆ ఇంటి చుట్టూనే కొనసాగుతూ ఉంటుంది.. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో వచ్చిన అతడు సినిమాలో పార్ధు ఇల్లు… అత్తారింటికి దారేది సినిమాలో సునంద ఇల్లు.. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో దేవరాజు ఇల్లు.. అల వైకుంఠపురం సినిమాలో టబు ఇల్లు .. చాలా హైలెట్గా చూపించారు. ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించే సినిమాలలో ఇల్లు సెంటిమెంటు తప్పనిసరిగా ఉంటుంది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తన తదుపరిచిత్రం మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ కూడా ఆయన మరోసారి తన ఇంటి సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్టు సమాచారం.
అంతేకాదు మహేష్ బాబు సినిమా కోసం త్రివిక్రమ్ ప్రత్యేకంగా ఇంటి కోసం భారీ హంగులతో సెట్ వేయబోతున్నారట. మరి మహేష్ సినిమాలో ఈ సెంటిమెంట్ ఫాలో అవ్వడమే కాకుండా ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఈ విధంగా తన కథకు కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాలో ఇంటిని త్రివిక్రమ్ రూపొందించనున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకి ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభించబోతున్నట్లు సమాచారం .ఇందులో పూజ హెగ్డే హీరోయిన్గా నటించబోతోంది. ఇప్పటికే పూజా హెగ్డే – మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన మహర్షి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.