మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినిమా టాప్ డైరెక్టర్లలో ఒకరు. ఈ విషయం ఖచ్చితంగా అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. త్రివిక్రమ్ కు సపరేట్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్‌కు తగినట్టుగా మార్కెట్ ఉంది. అలాంటి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో చేసిన అజ్ఞాతవాసి సినిమాతో ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో అరవింద సమేత సినిమా చేశాడు. ఆ సినిమా అటు త్రివిక్రమ్ కు.. ఇటు ఎన్టీఆర్ కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు అన్నది వాస్తవం. అజ్ఞాతవాసి నిరాశతో ఉన్న త్రివిక్రమ్‌కు కాస్త ఊపిరి పోసింది.
ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీతో అల వైకుంఠపురంలో సినిమా చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్లో త్రివిక్రమ్ మార్కెట్ అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. అజ్ఞాతవాసి సినిమా అక్కడ ఏకంగా రు. 18 కోట్లకు అమ్మారు. ఇప్పుడు బన్నీ ఈ సినిమాను కేవలం రు. 8 కోట్లకు మాత్రమే అమ్మారు. దీనినిబట్టి చూస్తే ఓవర్సీస్ మార్కెట్ ఎంతో తెలుస్తోంది. మరో వైపు మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు రు. 12 కోట్లకు అమ్మారు.
ఇక్కడ బన్నీ తోడు వున్నాడు. అక్కడ దర్శకుడు అనిల్ రావిపూడి వున్నారు. ఒక విధంగా రెండు సినిమాలు సమ ఉజ్జీలే. కానీ రేటు మాత్రం దీనికి తక్కువ వచ్చింది. ఓవర్ సీస్ లో అల్లు అర్జున్ మార్కెట్ తక్కువ. అందుకుని తక్కువ రేటుకు ఇచ్చారా ? లేదా ? రోజు రోజుకు త్రివిక్రమ్ మార్కెట్ డౌన్ అవుతుందా ? అన్నది ఈ సినిమా రిజల్ట్ చెప్పేస్తుంది. అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఓవర్సీస్లో త్రివిక్రమ్ అంటే మామూలు క్రేజ్ ఉండేది కాదు. ఇప్పుడు అదే త్రివిక్రమ్ సినిమా అక్కడ చాలా తక్కువ రేటుకు అమ్ముడవుతోంది. ఏదేమైనా అల వైకుంఠపురం త్రివిక్రమ్ కెరీర్‌కు అగ్నిపరీక్షగా మారింది.