తెలుగు ఇండస్ట్రీకి నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో పరిచయమైంది త్రిష.. ఆ తరువాత వర్షం , పౌర్ణమి వంటి మరికొన్ని సినిమాలతో బాగానే క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ విషయం ఏమిటంటే త్రిష పవన్ కళ్యాణ్ ని మోసం చేసిందట… ఇంతకు పవన్ కళ్యాణ్ ని త్రిష ఏ విషయంలో మోసం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. త్రిష చూడటానికి 16 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తుంది కానీ దాదాపు 40 ఏళ్ల వయసు దగ్గర పడింది. కానీ ఇంకా చిన్న పిల్లలాగే కనిపిస్తుంది.
ఇక తాజాగా ఈ మధ్యకాలంలో పొన్నియన్ సెల్వన్ అనే సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి మన ముందుకు వచ్చింది. ఈ బ్యూటీ ఆ సినిమాలో ఐశ్వర్యరాయ్ అందానికి తగ్గట్టుగానే త్రిష అందాలు కూడా ఆరబోసినట్టు ఉన్నాయి. ఇక ఈ విషయం కాస్త పక్కన పెడితే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీన్మార్ సినిమాలో త్రిష నటించిన విషయం మనందరికీ తెలిసిందే. త్రిష ఈ సినిమాలోనే కాకుండా బంగారం సినిమాలో ఒక ఐటెం సాంగ్ కూడా చేసింది. అయితే ఇప్పుడు రాబోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో హీరోయిన్గా చేయమని స్వయంగా డైరెక్టర్ హరీష్ శంకర్ అడిగితే కుదరదు అని చెప్పేసిందట త్రిష.
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయటం నా అదృష్టము అని అన్నది. కానీ ఇప్పుడు అవకాశం వస్తే మాత్రం లేదు.. నేను చెయ్యను అని చెప్పేసిందట. ఇక ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ పవన్ కళ్యాణ్ ని త్రిష దారుణంగా అవమానించిందని ఆయన సినిమానే రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏమని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.