టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా కొన్ని సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ త్రిష. ఇప్పటికి కూడా లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తు చాలా బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో కాస్త అవకాశాలు తగ్గిన కోలీవుడ్లో మాత్రం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతూ బాగా అలరిస్తోంది. ముఖ్యంగా తమిళ సినిమాలను తెలుగు వర్షన్ లో విడుదల చేస్తూ బాగా సందడి చేస్తూ ఉంటుంది.అయితే ఇటీవల పొన్నియన్ సెల్వన్ -1 చిత్రంలో నటించి ప్రేక్షకుల ను బాగా అలరించింది. ఇక త్వరలోనే ps-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక ఇవే కాకుండా రెండు మూడు చిత్రాలలో నటిస్తూనే మరొక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు సమాచారం. గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి త్రిష పైన ఎక్కువగా రాజకీయల లోకీ ఎంట్రీ ఇవ్వబోతుంది అనే వార్తలు చాలా వైరల్ గా మారాయి. ఇక జయలలిత అంటే త్రిష కు చాలా ఇష్టమని ఆమె ఆదర్శంగానే ఈమె కూడా రాజకీయాలలో అడుగుపెట్టే ఉద్దేశం ఉన్నట్లుగా అందుకోసం చర్చలు జరుపుతున్నట్లుగా తమిళ మీడియా నుంచి పెద్దగా వార్తలు వినిపించాయి.
ఈ విషయాలపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు త్రిష క్లారిటీ ఇవ్వడం జరిగింది. మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా ఆ వాస్తవమని తనకు రాజకీయాలలో రావాలని అసలు ఒక్క శాతం కూడా ఆసక్తి లేదని తెలియజేసింది. దీంతో రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన త్రిష వివాహ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి వచ్చే ఏడాదైనా ఇమే వివాహం చేసుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.