ఇన్ డైరెక్ట్ గా పెళ్లి పై వార్నింగ్ ఇచ్చిన త్రిష..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో వర్షం చిత్రంతో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్ త్రిష.. ఈమె రెండు దశాబ్దాల పైగ కెరీర్ ని పూర్తి చేసుకుంది. ఈ మధ్యనే పాన్నియన్ సెల్వన్ సిరీస్ ద్వారా మరల త్రిషకి కోలీవుడ్లో డిమాండ్ పెరిగిపోయింది. తెలుగులో ఓ సినిమా కోసం ఆమెతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రిష చేతిలో లియో, అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాతో పాటు మలయాళం లో కూడా ఓ భారీ బడ్జెట్ చిత్రం ఒకటి ఉంది.

Trisha reacts to rumours of her wedding: Keep calm and... - India Today

ఇదిలా ఉంటే త్రిష త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఈమె పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. వీటిపై వెబ్సైట్స్ కథనాలు కూడా ప్రాముఖ్యంగా పబ్లిష్ అయ్యాయి. ఇలా ఆమె పెళ్లి వార్తలు విజృంభించడంతో డైరెక్ట్ గా త్రిష రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది త్రిష..ఈ పోస్టుని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. “నువ్వు ఎవరో నాకు తెలుసు నీ టీమ్ గురించి నాకు తెలుసు ఇకనైనా పుకార్లకి పుల్ స్టాప్ పెట్టు అంటూ పోస్ట్ పెట్టింది”.. ఇప్పుడు ఈమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఇలా ఆమె పెళ్లిపై వస్తున్న పుకార్లకు ఒక్కసారిగా పుల్ స్టాప్ పెట్టింది త్రిష

ఈ పుకార్లకు కారణమైన వారు తెలిసి ఉండి కూడ త్రిష ఈ రూమర్స్ కి చెక్.. పెడుతూ ఈ విషయాన్ని పాపులర్ చేసిన వారిని పాయింట్ చేస్తూ.. పేరు మెన్షన్ చేయకుండా కామెంట్స్ చేసింది త్రిష ..దీనిని బట్టి ఆమె కెరీర్ నియంత్రించాలని చూసేవారు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అర్థమవుతుంది. అయితే ఇలాంటి ప్రచారాలు త్రిషపై చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న ఇప్పుడు సౌత్ సర్కిల్లో జోరుగా వినిపిస్తోంది. ఇక ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.

Share.