మొదట నీ మనసు నాకు తెలుసు అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది త్రిష. మొదటి సినిమాతోనే పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈమె ప్రభాస్ తో కలిసి నటించిన వర్షం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ సినిమాకు కుర్రకారులను సైతం తన వైపు తిప్పుకునేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక అలాంటి త్రిష వర్షం సినిమా తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది .స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.
ఇప్పటికి కూడా తమిళంలో స్టార్ హీరోయిన్గా కొనసాగిస్తూ పలు చిత్రాలలో నటిస్తోంది. ఇక గత సంవత్సరం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పోన్నియన్ సెల్వన్ సినిమాలో నటించింది. ఈ సినిమా త్రిష అందానికి చాలామంది అభిమానుల సైతం ఫిదా అయ్యారు. అంతేకాకుండా వయసు పెరుగుతున్న కొద్దీ ఇమే అందంలో ఏమాత్రం మార్పు రాలేదు అంటు పలువురు నేటిజెన్లు సైతం కామెంట్లు చేశారు. ఇక ఇదంతా ఇలా ఉండగా తాజాగా త్రిష రూ.35 కోట్ల రూపాయలు పెట్టి కోలీవుడ్లో స్టార్ విజయ్ ఇంటి పక్కన ఇల్లు తీసుకున్నట్లు సమాచారం.
అయితే విజయ్ ఇంటి పక్కన ఇల్లు ఎందుకు కొనుగోలు చేసిందా అంటూ చాలామంది ఆలోచనలో పడ్డారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్రిష త్వరలోనే వివాహం చేసుకోబోతోందని అదే ఇంట్లో ఉండబోతుందని ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన త్రిష వివాహం చేసుకొని ఫ్యామిలీ లైఫ్ని సినీ లైఫ్ని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం త్రిష ఒక్కో చిత్రానికి రూ.4 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.