టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటించిన చిత్రం వాల్తేర్ వీరయ్య .ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. అలాగే డైరెక్టర్ బాబి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. గెస్ట్ గా ఈ చిత్రంలో మాస్ హీరో రవితేజ కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా ట్రైలర్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు తాజాగా ఈరోజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది చిత్ర బృందం.
ఫ్రీ రిలీజ్ వేడుకలు ఆర్కే బీచ్ వద్ద నిర్వహించారు. జనవరి 13వ తేదీన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. ట్రైలర్ విషయానికి వస్తే.. ఇందులో చిరంజీవి డ్రగ్స్ మాఫియా క్రిమినల్ గా కనిపిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో కూడా చిరంజీవి ఖైదీగా కనిపించబోతున్నట్లు ఈ సినిమా ట్రైలర్లు కనిపిస్తోంది. మాస్ లుక్ లో మరొకసారి చిరంజీవి ముఠామేస్త్రి సినిమాని తలపించేలా కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయేలా కనిపిస్తోంది. సముద్రపు ఒడ్డున చిరంజీవి మాసింగ్ స్టైల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోందని చెప్పవచ్చు.
ముఖ్యంగా చిరంజీవి చేసే కామెడీ సన్నివేశాలు కూడా ఈ చిత్రానికి హైలైట్ నిలిచాలా ఈ ట్రైలర్లో కనిపిస్తోంది. శృతిహాసన్ కూడా ఇందులో చాలా క్యూట్ గా కనిపిస్తోంది. అలాగే మరొక హీరోయిన్ కేథరిన్ కూడా ఇందులో డాక్టర్ గా నటించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి ఈ సినిమా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.