తెలుగు బుల్లితెరపై రష్మి యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ముఖ్యంగా తన గ్లామర్ తో అందంతో కుర్రకారులను సైతం ఆకట్టుకునే విధంగా తన మాటలను కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఇక అప్పుడప్పుడు బుల్లితెరపై సుదీర్ తో కలిసి చేసేటువంటి స్కిట్లు కూడా అందరిని ఆకట్టుకునేలా ఉంటాయి. తాజాగా రష్మీ ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా నిన్నటి రోజున తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని యాంకర్ రష్మీ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది.
బరువెక్కిన గుండెతో కుటుంబం అంతా ఆమెకు చివరిసారిగా వీడ్కోలు తెలియజేశామని రష్మీ తెలుపుతోంది. ప్రమీల మిశ్రా ఒక స్ట్రాంగ్ ఉమెన్ అంటూ కూడా తెలియజేస్తూ ఈమె జ్ఞాపకాలు మాతో ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి అంటూ ఓం శాంతి అని తెలియజేస్తూ ఎమోషనల్ పోస్టుని షేర్ చేసింది రష్మి. ఇక లేడి యాంకర్ గా తనదైన స్టైల్ లో కెరీర్ ని ముందుకు నెట్టుకొస్తున్న రష్మి సినిమాలలో హీరోయిన్గా నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది దీంతో బుల్లితెర పైన తన హవా కొనసాగించాలని ఫిక్సయింది.
అందుచేతనే సినిమాలకు గుడ్ బై చెప్పేశాను అంటూ గతంలో ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక రష్మీ, సుధీర్ వివాహం చేసుకుంటే చూడాలని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ కేవలం మేమిద్దరం మంచి స్నేహితులమే అంటూ ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం రష్మీ కుటుంబంలో జరిగిన ఈ విషాదం వల్ల రష్మీ అభిమానులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.