సినిమాల రేటింగ్ కు సంబంధించి ఐ ఎం బి డి అత్యంత విశ్వసనీయతను కలిగి ఉన్నది. కొన్నిసార్లు ఈ రేటింగ్ పై విమర్శలు కూడా వచ్చినప్పటికీ ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా కేవలం యూజర్స్ ఇచ్చే రేటింగ్ ద్వారానే ఎన్నోసార్లు పలు జాబితాలను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు తాజాగా 2022 సంవత్సరానికి సంబంధించి పలు చిత్రాల రేటింగ్ను కూడా తెలియజేయడం జరిగింది. ఇక గడచిన కొద్ది రోజుల క్రితం ఇండియన్ సెలబ్రెటీల యొక్క టాప్ టెన్ జాబితాను విడుదల చేయగా అందులో ధనుష్ మొదటి స్థానంతో ఉండడం జరిగింది. ఇప్పుడు టాప్ టెన్ ఇండియన్ మూవీస్ జాబితాలో కూడా సౌత్ ఇండియన్ సినిమాలో అధిపత్యం క్లియర్గా కనిపిస్తోంది.
మొత్తం టాప్ టెన్ చిత్రాలలో కాశ్మీర్ ఫైల్స్ సినిమా తప్ప మిగతావన్నీ కూడా సౌత్ ఇండియన్ సినిమాలే హవా కొనసాగించాయి. ఇక మొదటి స్థానంలో RRR సినిమా ఉండగా రెండవ స్థానంలో హిందీ చిత్రం కాశ్మీర్ ఫైల్ నిలిచింది. ఇక మూడవ స్థానంలో కన్నడలో సూపర్ హిట్ అయిన కేజిఎఫ్ చాప్టర్-2 చిత్రం నిలవగా.. నాలుగవ స్థానంలో కమలహాసన్ నటించిన విక్రమ్ సినిమా నిలిచింది.
ఇక ఐదవ స్థానంలో కాంతారా చిత్రం నిలిచింది. ఆరవ స్థానంలో మాధవన్ నటించిన రాకెట్రి ఉండగా ఏడవ స్థానంలో అడవి శేషు నటించిన మేజర్ సినిమా ఉన్నది. 8వ స్థానంలో దుల్కర్ సల్మాన్ నటించిన సీతారాం చిత్రం ఉన్నది. ఇక తొమ్మిదవ స్థానంలో డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ -1 బాగా నిలిచి ఉన్నది చివరిగా పదవ స్థానంలో రక్షిత్ శెట్టి నటించిన చార్లీ -777 చిత్రం నిలిచింది. ఈ ఏడాది టాప్ టెన్ ఇండియన్ మూవీస్ చిత్రాలు ఎక్కువగా ఉండడం గమనార్హం. తమిళ సినిమాలు 2 హిందీ సినిమా ఒకటి టాప్ టెన్ లో చోటు తగ్గించుకున్నాయి ఈసారి జాబితాలో తెలుగు మరియు కన్నడ సినిమాలో ఆదిపత్యం ఎక్కువగా ఉన్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
ఎట్టకేలకు ఈసారి బాలీవుడ్ పరిశ్రమపైన సౌత్ సినీ పరిశ్రమ ఆదిపత్యం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో సౌత్ పరిశ్రమ మరింత ఎదుగుతుందేమో చూడాలి.
From the magic of RRR to the charm of 777 Charlie, here are the #IMDbBestof2022 Top 10 Most Popular Indian Movies of the year 💛 https://t.co/IAv7hXqGeA
— IMDb (@IMDb) December 14, 2022