రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టాలీవుడ్ నిర్మాత ?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటి తర్వాత ఒకరు మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. తాజాగా సిరివెన్నెల సీతారామశాస్త్రి, శివ శంకర్ మాస్టర్, హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు ఇలా వరుసగా విషాదాలు చోటు చేసుకున్నాయి. వీటి నుంచి ఇంకా కోలుకోక ముందే తాజాగా మరొక చోటు చేసుకుంది.ప్రముఖ నిర్మాత జక్కుల నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

తాజాగా ఆయన కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం మంటాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఈయన మరణ వార్త విన్న పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలువురు సెలబ్రిటీలు, దర్శకనిర్మాతలు అతనికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నాగేశ్వరరావు కు భార్య,కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. లవ్ జర్నీ, అమ్మ నాన్న ఊరెళితే, వీడు సరైనోడు లాంటి సినిమాలను తెలుగులో విడుదల చేశారు నిర్మాత జక్కుల నాగేశ్వరరావు. అయితే సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటుండడంతో టాలీవుడ్ సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Share.